
ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ఐపీఎల్ రానే వచ్చేసింది. మరో కొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. నేటి నుంచి రెండు నెలల పాటు క్రికెట్ ప్రపంచాన్ని తమ బ్యాట్, బాల్స్‌తో ఉర్రూతలూగించేందుకు స్టార్లందరూ రెడీ అయ్యారు. నేడు (మార్చి 22) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ధనాధన్ హంగామాకు తెరలేవనుంది. ప్రతి సీజన్ కు మాదిరి మ్యాచ్ కు ముందు గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఓపెనింగ్ సెర్మనీ వేడుకలకు సిద్ధమైంది.
ప్రారంభోత్సవ వేడుకలకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. షారుఖ్ కేకేఆర్ జట్టు కో ఓనర్. సొంతగడ్డపై ఓపెనింగ్ సెర్మనీ జరగడంతో అతను తన డ్యాన్స్ తో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. షారూఖ్ తో ఇండియా టాప్ సింగర్లు శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా తమ పాటలతో ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తన డ్యాన్స్ తో అభిమానులకి కిక్ ఇవ్వనుంది. సాయంత్రం 6 గంటల నుంచి వేడులకు ప్రారంభమవుతాయి.
🚨 IPL 2025 UPDATE 🚨
— Field Vision (@FieldVisionIND) March 17, 2025
Shreya Ghoshal, Disha Patani, Karan Aujla to perform in the opening Day of IPL 2025 at Eden Gardens.
Meanwhile Hanumankind, Timmy Trumpet and Sanjith Hegde will perform during RCB Unbox event.#IPL2025 pic.twitter.com/PJ1JOKhEig
Shah Rukh Khan to perform at Tata IPL 2025 opening ceremony ❤️❤️❤️#RCBvKKR pic.twitter.com/7ngwHUCBSF
— Anand Yadav (@yadav_anan78724) March 22, 2025
ఇదిలా ఉంటే ఈ రోజు ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు జరిగేలా కన్పించడం లేదు. కొన్ని రోజులుగా కోల్ కతాలో కురుస్తున్న వర్షాలే ఇందుకు కారణం. రిపోర్ట్స్ ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో 80 శాతం వర్షం పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే మ్యాచ్ తో పాటు ప్రారంభోత్సవ వేడుకలు జరగకపోవచ్చు. ఈ విషయం అభిమానులకు నిరాశ కలిగించవచ్చు. 7 గంటలకు టాస్.. 7:30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్,జియో హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. సొంత గడ్డ కావడంతో ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫేవరేట్స్ గా బరిలోకి దిగుతుంది.
స్క్వాడ్‌లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:
విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, స్వప్నిల్ సింగ్, లుంగియో షెఫెర్, మన్మరియో షెఫెర్, మన్మరియో షెఫెర్, రౌజ్ షెఫెర్, నువాన్ తుషార, జాకబ్ బెథెల్, సుయాష్ శర్మ, మోహిత్ రాథీ, స్వస్తిక్ చికారా, అభినందన్ సింగ్
కోల్‌కతా నైట్ రైడర్స్ స్క్వాడ్:
క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్, వైభవ్, మన్‌దీన్ అరోరా, రహబాజ్‌మాన్ అరోరా, జి. అన్రిచ్ నార్ట్జే, రోవ్‌మన్ పావెల్, అనుకుల్ రాయ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, లువ్‌నిత్ సిసోడియా