ఇండోర్ : సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో కర్నాటక ఆల్‌రౌండర్ శ్రేయస్ గోపాల్ (4/19) హ్యాట్రిక్ వికెట్లతో ఆకట్టుకున్నాడు. బరోడాతో మంగళవారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా (0), అతని అన్న కెప్టెన్ క్రునాల్ పాండ్యా (0)ను గోల్డెన్ డకౌట్ చేశాడు. అయినా ఈ మ్యాచ్‌లో బరోడా 4 వికెట్ల తేడాతో కర్నాటకను ఓడించింది. తొలుత కర్నాటక 169/8 స్కోరు చేయగా.. బరోడా 18.5 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది.
మరోవైపు గత వారం త్రిపురపై 28 బాల్స్‌లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించిన గుజరాత్ యంగ్‌స్టర్ ఉర్విల్ పటేల్ (41 బాల్స్‌లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో115 నాటౌట్) ఈసారి 38 బాల్స్‌లో వంద పూర్తి చేసుకున్నాడు. దాంతో ఉత్తరాఖండ్‌తో గ్రూప్–సి పోరులో గుజరాత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.