SRH vs PBKS: మ్యాక్స్ వెల్‌పై అయ్యర్ ఫైర్.. కెప్టెన్‌ను లెక్క చేయకుండా ఇలా చేశాడేంటి!

SRH vs PBKS: మ్యాక్స్ వెల్‌పై అయ్యర్ ఫైర్.. కెప్టెన్‌ను లెక్క చేయకుండా ఇలా చేశాడేంటి!

ఐపీఎల్ 2025లో మ్యాక్స్ వెల్ చేసిన పనికి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కోపానికి గురయ్యాడు.శనివారం (ఏప్రిల్ 12) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఐదో ఓవర్ రెండో బంతిని మ్యాక్స్ వెల్  ప్రభ్సిమ్రాన్ సింగ్ లెగ్ సైడ్ వేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ కు తగిలిందేమో అని మ్యాక్సీ వెంటనే అంపైర్ వైపు చూస్తూ రివ్యూ కోరాడు. ఈ క్రమంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను అడిగి రివ్యూ తీసుకోవాలనే సంగతి మర్చిపోయాడు. 

కెప్టెన్ ను సంప్రదించకుండా DRS తీసుకోకూడదు. కానీ మ్యాక్సీ ఈ రూల్ ను బ్రేక్ చేశాడు. ఈ హఠాత్తు నిర్ణయం అయ్యర్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. శ్రేయాస్ సహచరుల వైపు అరుస్తూ, "పెహ్లే ముజ్సే పుచ్ నా" (ముందుగా నన్ను అడగండి) అని చెప్పినట్లు తెలుస్తోంది. చివరకు అయ్యర్ అయిష్టంగానే అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. ఐపీఎల్ DRS నిబంధనల ప్రకారం.. సమీక్ష తీసుకునే తుది అధికారం కెప్టెన్‌కే ఉంటుంది. కానీ గ్లెన్ మాక్స్‌వెల్ ఆ ప్రోటోకాల్‌ను దాటవేసాడు. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.   

►ALSO READ | SRH vs PBKS: తొలి మ్యాచ్ నుంచి జేబులోనే: అభిషేక్ పరువు తీసిన ట్రావిస్ హెడ్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే అభిషేక్ తుఫాన్ ఇన్సింగ్స్‎తో 246 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఎస్ఆర్‎హెచ్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేజ్ చేసి సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా  శనివారం (ఏప్రిల్ 12) పంజాబ్ కింగ్స్ పై జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి గెలిచింది.