Duleep Trophy 2024: మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు డకౌట్లు.. దులీప్ ట్రోఫీలోనూ అయ్యర్ విఫలం

Duleep Trophy 2024: మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు డకౌట్లు.. దులీప్ ట్రోఫీలోనూ అయ్యర్ విఫలం

టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కష్టాలు కొనసాగుతున్నాయి. భారత జట్టులో స్థానం సంపాదించుకోలేని అయ్యర్.. దేశవాళీ క్రికెట్ లోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా డి తరపున ఆడుతున్న శ్రేయాస్.. తొలి ఇన్నింగ్స్ లో డకౌటయ్యాడు. 5 బంతుల్లో పరుగుల ఖాతా చేయకుండా రాహుల్ చాహర్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించాల్సిన ఈ ముంబై స్టార్.. జట్టుకు భారంగా మారుతున్నాడు.

దులీప్ ట్రోఫీలో చివరి మూడు ఇన్నింగ్స్ ల్లో అయ్యర్ కు ఇది రెండో డకౌట్. ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్ లు ఆడిన అయ్యర్.. కేవలం ఒకే హాఫ్ సెంచరీ చేశాడు. 20 యావరేజ్ తో 104 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవలే జరిగిన మ్యాచ్ లో సన్ గ్లాస్ పెట్టుకొని బ్యాటింగ్ చేసిన అయ్యర్ డకౌటై తీవ్ర విమర్శల పాలయ్యాడు. తాజాగా చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనూ డకౌటయ్యాడు. దీంతో అయ్యర్ ఇక భారత జట్టులో చోటు దక్కించుకోవడం అనుమానంగా మారింది.  

Also Read :- పంత్‌కు కోపం తెప్పించిన బంగ్లాదేశ్ వికెట్ కీపర్

క్రమశిక్షణ లేని కారణంగా బీసీసీఐ అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఫామ్ లేకపోవడం.. గాయాలు అతన్ని జట్టు నుంచి దూరం చేశాయి. గంభీర్ ప్రధాన కోచ్ కారణంగా ఇటీవలే శ్రీలంకతో ముగిసిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లోనూ అయ్యర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటికే టీ20 జట్టులో స్థానం కోల్పోయిన అయ్యర్.. ఫామ్ లోకి రాకపోతే భారత జట్టులో ఎంట్రీ కష్టంగానే కనిపిస్తుంది.