టెస్టు మ్యాచ్‌లైనా నా తీరు మారదు..ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు అయ్యర్ బోల్డ్ కామెంట్స్

టెస్టు మ్యాచ్‌లైనా నా తీరు మారదు..ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు అయ్యర్ బోల్డ్ కామెంట్స్

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కు పక్కన పెట్టడం..సౌతాఫ్రికా టెస్టు సిరీస్ లో విఫలమవడం..రంజీల్లో ఆడటం లాంటి విషయాలు గమనిస్తే అయ్యర్ కు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు చోటు దక్కడం కష్టమేనని భావించారు. ఇదిలా ఉండగా.. ఈ ఇంగ్లాండ్ పై జరగబోయే టెస్టు సిరీస్ పై ఈ ముంబై బ్యాటర్ బాస్ కామన్స్ చేసాడు. 

రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై తరఫున ఆంధ్రాతో అయ్యర్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 48 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ అనతరం ఈఎస్పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన అయ్యర్‌.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తాను ఎటాకింగ్ క్రికెట్‌ ఆడతానని.. బాల్స్‌ను వదిలేయడం తనకు బోర్‌ అని షాకింగ్ కామెంట్స్ చేసాడు. డిఫెన్స్‌ మోడ్‌లో ఆడితే జట్టును ఒక దశ చేరేదాకా అదే విధంగా ఆడాల్సి ఉంటుంది. నేను ఎన్ని పరుగులు చేశాననేకంటే ఎలా ఆడానన్నది ముఖ్యం. రంజీ మ్యాచ్‌లో నేను చేసింది తక్కువ స్కోరే అయినా నా ఆట పట్ల సంతృప్తిగా ఉన్నా. అని అయ్యర్ అన్నాడు. 

సీనియర్లను కాదని దక్షిణాఫ్రికా సిరీస్ కు అయ్యర్ ను ఎంపిక చేస్తే రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో 41 పరుగులు చేసిన ఈ ముంబై బ్యాటర్ ఫామ్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఫామ్ కోసం దేశంలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ ఆడాల్సి వచ్చింది. ఈ సమయంలో అయ్యర్ ఇలాంటి కామెంట్స్ చేయడం షాక్ కు గురి చేస్తుంది.