పంజాబ్ కింగ్స్‌‌ కెప్టెన్‌‌గా శ్రేయస్ అయ్యర్‌‌‌‌

ముంబై: ఐపీఎల్‌‌ వేలంలో రెండో అత్యధిక ధర పలికిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌‌‌‌ పంజాబ్ కింగ్స్‌‌ కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. గత సీజన్‌‌లో కెప్టెన్‌‌గా కోల్‌‌కతా నైట్ రైడర్స్‌‌కు ట్రోఫీ అందించిన అయ్యర్‌‌ను ఈ సీజన్ వేలంలో పంజాబ్‌‌  రూ. 26.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. 

ఊహించినట్టుగానే అతనికే కెప్టెన్సీ అప్పగిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది.. 2015లో ఐపీఎల్‌‌లో అడుగు పెట్టిన  శ్రేయస్‌‌ తొలుత  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు. 2018 సీజన్‌‌ మధ్యలో ఆ టీమ్ కెప్టెన్సీ చేపట్టాడు. వరుసగా మూడు సీజన్లు ఆ టీమ్‌‌ను ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత కేకేఆర్ జట్టులో చేరాడు.