
న్యూజిలాండ్తో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 203 పరుగుల వద్ద ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (29) ఔట్ అయ్యాడు. బ్రాస్ వేల్ బౌలింగ్లో షాట్ ఆడబోయే క్రమంలో అక్షర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అక్షర్ ఔట్ కావడానికి ఓవర్ ముందే అద్భుత ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ వికెట్ కోల్పోయాడు. 48 రన్స్ చేసిన అయ్యర్ సాంటర్న్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. కోహ్లీ, రోహిత్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అయ్యర్, అక్షర్ జోడీ టీమిండియాను గెలుపు దిశగా తీసుకెళ్లింది.
ALSO READ | IND vs NZ Final: కంగారు పెడుతున్న కివీస్.. గిల్, రోహిత్, కోహ్లీ ఔట్
కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. దీంతో అక్షర్, అయ్యర్ జోడీ టీమిండియాను విజయ తీరాలకు చేర్చుతుందని ఫ్యాన్స్ అనుకోగా.. వెను వెంటనే ఇద్దరూ ఔట్ అయ్యారు. క్రీజులో సెట్ అయిన ఇద్దరు వెంట వెంటనే ఔట్ కావడంతో టీమిండియా ఒత్తిడిలోకి వెళ్లింది. వెంట వెంటనే రెండు వికెట్లు పడటంతో టీమిండియా ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (15), హర్ధిక్ పాండ్యా (5) క్రీజులో ఉన్నారు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కైవసం చేసుకోవాలంటే.. 36 బంతుల్లో 40 పరుగులు చేయాలి.