IND vs AUS: అయ్యో.. అయ్యర్: నీ కష్టం ఎవరికీ రాకూడదు

IND vs AUS: అయ్యో.. అయ్యర్: నీ కష్టం ఎవరికీ రాకూడదు

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి చూస్తుంటే సగటు క్రికెట్ అభిమానికి జాలి కలగక మానదు. పూర్తి ఫిట్ నెస్ సాధించకుండా ఆసియా కప్ కి ఆ తర్వాత వరల్డ్ కప్ కి సెలక్టయ్యాడు. ఆసియా కప్ లో పాకిస్థాన్ మీద గ్రూప్ మ్యాచ్ ఆడిన అయ్యర్.. ఆ తర్వాత గాయం తిరగబెట్టడంతో బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఫిట్ నెస్ సాధించిన ఈ ముంబై బ్యాటర్.. తొలి వన్డేలో ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించినా దురదృష్టం వెంటాడింది.  

చేజేతులా రనౌట్ 

మొహాలీ వేదికగా నిన్న జరిగిన తొలి వన్డేలో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. గైక్వాడ్, గిల్, రాహుల్, సూర్య అందరూ హాఫ్ సెంచరీలు చేసి వరల్డ్ కప్ కి ముందు మంచి టచ్ లో కనిపించారు. అయితే అయ్యర్ మాత్రం చేజేతులా రనౌట్ అయ్యి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 24 ఓవర్ నాలుగో బంతికి జంపా బౌలింగ్ లో కవర్స్ దిశగా ఆడిన అయ్యర్..లేని పరుగు కోసం ప్రయత్నించి ఔటయ్యాడు.

Also Read :- హరహర మహాదేవ: శివుడి ఆకారపు స్టేడియానికి.. క్రికెట్ దిగ్గజాల రాక

ఓ వైపు అవతలి ఎండ్ లో గిల్ సిద్ధంగా లేకపోయినా అయ్యర్ కంగారులో వికెట్ పారేసుకున్నాడు.దీంతో 3 పరుగులకే పెవిలియన్ కి చేరాడు.ఫిట్ నెస్ నిరూపించుకొని ఫామ్ లోకి వద్దామనుకున్న అయ్యర్ కి ఇలా రనౌట్ రూపంలో వికెట్ కోల్పోవడం చాలా దురదృష్టం.అసలే ఫిట్ నెస్ సమస్యలు వేధిస్తుంటే ఇంతలో రనౌట్ రూపంలో బ్యాడ్ లక్ వచ్చి చేరింది. అంతేకాదు వరల్డ్ కప్ దగ్గరలో ఉండడంతో అయ్యర్ ఫామ్ టీమిండియాకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఆసీస్ తో చివరి రెండు వన్డేల్లో ఎలా కమ్ బ్యాక్ ఇస్తాడో చూడాలి.