KKR vs PBKS: పరువు పోగొట్టుకున్న శ్రేయాస్.. ప్లేయింగ్ 11 మర్చిపోయి బిక్క ముఖం

KKR vs PBKS: పరువు పోగొట్టుకున్న శ్రేయాస్.. ప్లేయింగ్ 11 మర్చిపోయి బిక్క ముఖం

మంగళవారం (ఏప్రిల్ 15) కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ సమయంలో చేసిన పని వైరల్ అవుతుంది. చండీఘర్ లోని ముల్లన్పూర్ లో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సమయంలో హర్ష భోగ్లే శ్రేయాస్ అయ్యర్ ను తుది జట్టులో మార్పుల గురించి అడిగాడు. అయితే పంజాబ్ కెప్టెన్ మాత్రం చెప్పలేకపోయాడు. ప్లేయింగ్ 11 లో మార్పులు గుర్తు లేవు. తర్వాత చెప్తా అని సమాధానమిచ్చాడు. దీంతో కాసేపు అక్కడ కామెడీ చోటు చేసుకుంది.

సహజంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మర్చిపోతాడనే పేరుంది. కానీ అయ్యర్ కూడా తన మతిమరుపుతో హిట్ మ్యాన్ ను గుర్తు చేశాడు. శ్రేయాస్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన లాకీ ఫెర్గుసన్ స్థానంలో జేవియర్ బార్ట్‌లెట్ ప్లేయింగ్ 11లోకి రాగా.. ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ స్థానంలో మరో ఆసీస్ క్రికెటర్ జోష్ ఇంగ్లిష్ కు స్థానం దక్కింది. మరోవైపు   కోల్‌కతా ఒక మార్పుతో బరిలోకి దిగింది. మొయిన్ అలీ స్థానంలో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే జట్టులోకి వచ్చాడు. 

Also Read :- ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్మన్గా మీరాబాయి చాను

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ డకౌటయ్యాడు. ఎదుర్కొన్న రెండో బంతికే థర్డ్ మ్యాన్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హర్షిత్ రానా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ నాలుగో బంతిని అయ్యర్ బలంగా కట్ షాట్ ఆడగా.. థర్డ్ మ్యాన్ లో రమణ్ దీప్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇదే ఓవర్ రెండో బంతికి ప్రియాంష్ ఆర్య ఔట్ కాగా.. పవర్ ప్లే ముగిసేసరికి 54 పరుగులకే నాలుగు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.