IPL 2024: కేకేఆర్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. గాయంతో కెప్టెన్ ఔట్

IPL 2024: కేకేఆర్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. గాయంతో కెప్టెన్ ఔట్

ఐపీఎల్ కు ముందు ఒకొక్కరు గాయాల కారణంగా వెనుదిరుగుతున్నారు. ప్రతి సీజన్ లో ఇది జరిగేదే అయినా ఈ సీజన్ లో ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది. తాజాగా కోల్ కత్తా కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు ఈ కేకేఆర్ కెప్టెన్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయ్యర్ వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

అయ్యర్ ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడుతున్నాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా 111 బంతుల్లోనే 95 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత అయ్యర్ వెన్ను నొప్పితో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఐదో రోజు అతడు మైదానంలోకి బరిలోకి దిగే అవకాశాలు లేవని.. వెన్ను గాయం తీవ్రమైందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టుల తర్వాత అయ్యర్ గాయపడడంతో చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని NCA కు వెళ్లి కోలుకొని రంజీ మ్యాచ్ ఆడినా గాయం మళ్ళీ తిరగబెట్టింది. 

ALSO READ :- Geetanjali Death: గీతాంజలి మరణం కేసులో టీడీపీ కార్యకర్త అరెస్ట్

సంత్సరం నుంచి అయ్యర్ వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ ముంబై బ్యాటర్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు దూరమయ్యాడు. రూ. 12.5 కోట్ల భారీ ధరకు అయ్యర్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ప్రస్తుతం కేకేఆర్ కేప్టెన్ గా ఉన్న అయ్యర్.. దూరమైతే ఆ జట్టుకు భారీ దెబ్బ తగలడం ఖాయం. మరో వారం రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో అయ్యర్ ఆడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. మార్చి 23న సన్ రైజర్స్ తో కేకేఆర్ తమ తొలి మ్యాచ్ తో ఈ సీజన్ ప్రారంభిస్తుంది.  వైస్ కెప్టెన్ గా ఉంటున్న నితీష్ రానా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది .