Shreyas Iyer: టైటిల్ గెలిపించినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు: శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer: టైటిల్ గెలిపించినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు: శ్రేయాస్ అయ్యర్

భారత్ వేదికగా 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. బీసీసీఐ చెప్పిన మాట వినకుండా దేశవాళీ క్రికెట్ లో ఆడకుండా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయాడు. టెస్టుల్లో పేలవ ఫామ్ తో మూడు ఫార్మాట్ లలో భారత జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. అయితే ఐపీఎల్ తో అయ్యర్ కెరీర్ బౌన్స్ బ్యాక్ అయింది. ఐపీఎల్ టైటిల్ గెలిపించిన తర్వాత దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టాడు.

రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించి భారత జట్టులో చోటు సంపాదించాడు. ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 248 పరుగులు చేసిన అయ్యర్ అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి విజయానందంలో ఉన్న అయ్యర్ ఐపీఎల్ లో తనకు గుర్తిపు లభించలేదని ఎమోషనల్ కామెంట్స్  చేశాడు.    

"ఐపీఎల్ గెలవడం ప్రధాన లక్ష్యం. అదృష్టవశాత్తూ నేను గెలిచాను. ఐపీఎల్ గెలిచిన తర్వాత నేను కోరుకున్న గుర్తింపు పొందలేదని నేను వ్యక్తిగతంగా భావించాను. ఎవరూ గుర్తించకపోయినా మీరు సరైన పనులు చేస్తూ ముందుకు సాగాలి. అది చాలా ముఖ్యం. నేను అదే చేశాను". అని అయ్యర్ అన్నాడు. అయ్యర్ కెప్టెన్సీలో కోల్ కతా నైట్ రైడర్స్ 2024 ఐపీఎల్ టైటిల్ ను గెలిచింది. ఏ సమయంలో క్రెడిట్ అంతా హెడ్ కోచ్ గంభీర్ కు దక్కగా శ్రేయాస్ అయ్యర్ కు పెద్దగా గుర్తింపు రాలేదు. 2025 ఐపీఎల్ సీజన్ లో అయ్యర్ ను కేకేఆర్ జట్టు రిటైన్ చేసుకోకుండా బిగ్ షాక్ ఇచ్చింది.

ALSO READ | AUS vs ENG: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య స్పెషల్ పింక్ బాల్ టెస్ట్.. ఎప్పుడు, ఎందుకంటే..?

ఈ సందర్భంగా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గురించి కూడా మాట్లాడాడు. కొన్ని సార్లు నేను చేసిన ప్రయత్నాలకు సరైన గుర్తింపు లభించకపోయినా నేను చాలా సంతృప్తికరంగా ఉంటాను. ఇక్కడ వికెట్లు బ్యాటింగ్ చేయడానికి అంతగా అనుకూలంగా ఉండవు. బౌలర్లు సరైన లెంగ్త్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు సింగిల్స్ తీయడం చాలా కష్టం. రెండు సిక్సర్లు కొడితే మ్యాచ్ మనవైపుకు మళ్లుతుందని ఆశించాను. అదృష్టవశాతూ కీలక సమయాల్లో నేను సిక్సర్లు కొట్టగలిగాను".అని అయ్యర్ అన్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయ్యర్‌ను జట్టులో 'సైలెంట్ హీరో' అని ప్రశంసించాడు. 

ఐపీఎల్‌‌ వేలంలో రెండో అత్యధిక ధర పలికిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌‌‌‌ పంజాబ్ కింగ్స్‌‌ కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. గత సీజన్‌‌లో కెప్టెన్‌‌గా కోల్‌‌కతా నైట్ రైడర్స్‌‌కు ట్రోఫీ అందించిన అయ్యర్‌‌ను ఈ సీజన్ వేలంలో పంజాబ్‌‌  రూ. 26.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. 2015లో ఐపీఎల్‌‌లో అడుగు పెట్టిన  శ్రేయస్‌‌ తొలుత  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు. 2018 సీజన్‌‌ మధ్యలో ఆ టీమ్ కెప్టెన్సీ చేపట్టాడు. వరుసగా మూడు సీజన్లు ఆ టీమ్‌‌ను ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత కేకేఆర్ జట్టులో చేరాడు.