సాధారణంగా ఒక ఆటగాడు గాయాన్ని బట్టి కోలుకోవడానికి సమయం పడుతుంది. కానీ శ్రేయాస్ అయ్యర్ కి మాత్రం కోలుకున్న ప్రతిసారి నిను వీడను నేను అంటూ గాయం తిరగబెడుతుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన ఈ ముంబై బ్యాటర్ ఐపీఎల్ తో నుంచి క్రికెట్ ఆడడం లేదు. అయితే ఇటీవలే పూర్తిస్థాయిలో కోలుకొని వరల్డ్ కప్ జట్టులో ఎంపికైన అయ్యర్ కి మరోసారి వెన్ను సమస్య పలకరించింది.
ఇలాగైతే కష్టమే శ్రేయాస్..
మొన్నటివరకు అయ్యర్ ఫిట్ నెస్ మీద ఎన్నో సందేహాలు ఉన్న మాట నిజమే. అయితే టీమిండియాలో కీలక ప్లేయర్ గా ఉంటున్న అయ్యర్.. జట్టులోకి రావడానికి బాగా కష్టపడ్డాడు. బెంగళూర్ NCAలో తీవ్రంగా శ్రమించి ఫిట్ నెస్ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఆసియా కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ కూడా ఆడేశాడు. అంతా బాగుంది అనుకుంటున్నా తరుణంలో మరోసారి గాయంతో నిన్న సూపర్-4 లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ కి దూరమయ్యాడు.దీంతో రాహుల్ అతని గైర్హాజరీలో తిరిగి ప్లేయింగ్ XIలోకి వచ్చాడు.
ALSO READ :ఈ బుడ్డోల్లేంటి.. ఆడోల్లేంటి: న్యూజిలాండ్ వరల్డ్ కప్ జట్టు ఎలా ప్రకటించారో తెలుసా..?
అయ్యర్ ఇలా పదే పదే గాయమవ్వడం టీమిండియాకు ఎంతైనా నష్టమే. ఫిట్ నెస్ లేకుండా జట్టులో ఉంచుకోవడం కంటే ఆ స్థానంలో ఆ స్థానంలో టాలెంటెడ్ ప్లేయర్స్ తిలక్ వర్మ, సంజు శాంసన్ లలో ఎవరికి అవకాశమిచ్చినా సద్వినియాగం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అయ్యర్ తన జల్సాలకు ఇచ్చిన ప్రాముఖ్యత తన ఫిట్ నెస్ కి ఇవ్వడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పబ్బులో,క్లబులో కనబడుతూ టీమిండియాకు ఆడాలనే కసి అయ్యర్ లో ఉండడం లేదు. ఈ క్రమంలో చాహల్ భార్య ధనశ్రీతో అయ్యర్ చేసిన బాగోతం అందరికీ తెలిసిందే. చాహల్ భార్య ధనశ్రీతో సరదాగా డ్యాన్స్ వేస్తూ కనిపించిన ఫోటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. మొత్తానికి అయ్యర్ ఇంకెంతకాలం జట్టులో టైమ్ పాస్ చేస్తాడో చూడాలి.
ఛాన్స్ దొరుకుతుందో లేదో అన్నట్ట గాయాన్ని పట్టించుకోకుండా..
— Muskmelon (@gova3555) September 11, 2023
సహచర క్రికెటర్ భార్యతో పార్టీలు, పబ్బులు తిరిగావ్! చివరకి ఏమైందో చూడు..
ఇకనైనా బుద్ధి మార్చుకో అయ్యర్.. NCAలో ఉంటూ ఫిట్ నెస్ మీద ఫోకస్ చెయ్.. pic.twitter.com/tnONZ89DPU