IND vs AUS: పసలేని ఆసీస్ బౌలింగ్.. గిల్, అయ్యర్ సెంచరీలు

IND vs AUS: పసలేని ఆసీస్ బౌలింగ్.. గిల్, అయ్యర్ సెంచరీలు

వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ అదిరిపోయింది. ఆసీస్ బౌలర్లను చిత్తకొడుతూ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్నారు. ఇండోర్ లో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నాలుగో ఓవర్లోనే గైక్వాడ్ వికెట్ కోల్పోయినా.. ఫామ్ లో ఉన్న గిల్ తో శ్రేయాస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కుదురుకోవడానికి సమయం కూడా తీసుకోకుండా బౌండరీల వర్షం కురిపించారు. ఈ క్రమంలో గిల్, అయ్యర్ హాఫ్  సెంచరీలు పూర్తి చేసుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత మరింత వేగంగా బ్యాట్ ఝళిపించారు. 

Also Read : Asian Games 2023: అడుగు దూరంలో గోల్డ్.. భారత్ ఫైనల్ ప్రత్యర్థి ఎవరంటే..?

అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. గిల్ 92 బంతుల్లో వన్డేల్లో తన ఆరో సెంచరీని సాధించాడు. సెంచరీ తర్వాత అయ్యర్ అవుట్ కాగా.. కెప్టెన్ రాహుల్, గిల్ తో క్రీజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 33 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి  230 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్ల జోరు చూస్తుంటే స్కోర్ 400 పరుగులు దాటేలా కనిపిస్తుంది. కాగా ఈ మొహాలీలో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.