ముంబై: ఒడిశాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–ఎ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (228 బాల్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్స్‌లతో 233) డబుల్ సెంచరీతో చెలరేగాడు. సిద్ధేశ్ లాడ్ (169 నాటౌట్) అండగా నిలవడంతో 385/3 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన ముంబై తొలి ఇన్నింగ్స్‌ను 123.5 ఓవర్లలో 602/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
శ్రేయస్, సిద్ధేశ్ ఐదో వికెట్‌కు అజేయంగా 354 రన్స్ జత చేశారు. సూర్యాన్ష్ షెడ్జే (79 నాటౌట్) ఆకట్టుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఒడిశా ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 146/5 స్కోరు చేసింది. సందీప్ పట్నాయక్ (73 బ్యాటింగ్), దేబబ్రత ప్రధాన్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.