Shreyas Iyer: అయ్యరే వద్దన్నాడు: జట్టు కోసం సెంచరీ త్యాగం చేసిన శ్రేయాస్

Shreyas Iyer: అయ్యరే వద్దన్నాడు: జట్టు కోసం సెంచరీ త్యాగం చేసిన శ్రేయాస్

ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‎తో జరుగుతోన్న మ్యాచులో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దుమ్మురేపాడు. పంజాబ్ జట్టు పగ్గాలు చేపట్టిన తొలి మ్యాచులోనే 97 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయ్యర్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లతో పాటు ఏకంగా 9 సిక్సర్లు ఉండడం విశేషం. 19 ఓవర్ ముగిసేసరికి 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న అయ్యర్ చివరి ఓవర్ లో స్ట్రైకింగ్ రాకపోవడంతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే అయ్యర్ జట్టు కోసం సెంచరీ త్యాగం చేసినట్టు తెలుస్తుంది.

19 ఓవర్లు ముగిసేసరికి అయ్యర్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ దశలో అయ్యర్ కు ఒక్క బాల్ ఆడే అవకాశం వచ్చినా సెంచరీ పూర్తి చేసుకునేవాడు. కానీ జట్టు కోసం శ్రేయాస్ గొప్ప మనసును చాటుకున్నాడు. చివరి ఓవర్ లో తన సెంచరీ కోసం ఆలోచించవద్దని శశాంక్ కు చెప్పాడు. ఈ విషయాన్ని శశాంక్ ఇన్నింగ్స్ తర్వాత చెప్పాడు. సెంచరీ కోసం ఆలోచించే బ్యాటర్లు ఉండడం సహజం.. కానీ జట్టు కోసం సెంచరీని త్యాగం చేసే బ్యాటర్లు అయ్యర్ లా అరుదుగా ఉంటారు. 

చివరి ఓవర్ లో శశాంక్ బౌండరీల వర్షం కురిపిస్తూ ఏకంగా 23 పరుగులు బాదాడు. మొత్తం 5 ఫోర్లతో కొట్టాడు. ఒకవేళ సెంచరీ కోసం చూసుకుంటే 7 నుంచి 8 పరుగులు తగ్గే అవకాశం ఉంది. అదే జరిగితే పంజాబ్ కు ఎంతో కొంత దెబ్బె. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (97) వీరోచిత ఇన్సింగ్ ఆడగా.. చివర్లో శశాంక్ సింగ్ (44) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.