కంటెంట్​ క్రియేషన్​ కోసం భారీ ప్లాన్స్​

కంటెంట్​ క్రియేషన్​ కోసం భారీ ప్లాన్స్​
  • రూ. 1,400 కోట్ల టర్నోవర్​
  • ఐదేళ్లలో ఐపీఓ
  • శ్రేయస్​ మీడియా ఫౌండర్​ శ్రీనివాస్

హైదరాబాద్​, వెలుగు: సినిమా అనగానే శ్రేయాస్​ మీడియా గుర్తుకొచ్చేలా గుర్తింపు తెచ్చుకోవాలని శ్రేయాస్​ మీడియా లక్ష్యంగా పెట్టుకుంది. సినిమా ఈవెంట్లను దేశంలోని పల్లె  ప్రజలకు సైతం చేరువ చేసే ప్లాన్​లో ఉన్నామని, దీంతో డైరెక్ట్​గా–ఇండైరెక్ట్​గా లక్ష మందికి ఎంప్లాయ్​మెంట్​ కల్పించాలనే టార్గెట్​ను పెట్టుకున్నామని శ్రేయస్​ మీడియా ఫౌండర్​ శ్రీనివాస్​ చెప్పారు. దీంతోపాటు ఓటీటీ రంగంలోకి దూకుడుగా ఎంటరయ్యే ప్రపోజల్​ ఉందని వెల్లడించారు.

రూ. 100 కోట్ల టర్నోవర్​కు చేరుకున్న తమ ​గ్రూప్​ ఇప్పుడు విస్తరణ కోసం భారీగా ఫండ్స్​ సేకరించే ప్రయత్నాలలో ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద ఇన్వెస్టర్లతో ఈ దిశలో డిస్కషన్స్​ నడుస్తున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని చిన్న పల్లెలో పుట్టిన తాను సొంత కాళ్లపై నిలబడాలనే ఆలోచనతో 2005 లో యాడ్ ఏజన్సీతో వ్యాపారంలోకి వచ్చానని శ్రీనివాస్​ చెప్పారు. ఆ తర్వాత సినిమా ప్రి రిలీజ్​ ఈవెంట్లతో పట్టు సాధించి, అనంతరం సినిమా ప్రొడక్షన్​లోకి జర్నీ కొనసాగించినట్లు వివరించారు. దక్షిణాదిలోని నాలుగు భాషల సినిమాలతోపాటు, బాలీవుడ్​ సినిమాలకు సైతం ఈవెంట్లు చేసేలా భారీ ప్లాన్స్​ ఉన్నాయని, దుబాయ్​ కేంద్రంగా గ్లోబల్​ ఈవెంట్లూ చేపడతామని శ్రీనివాస్​ చెప్పారు.

రాబోయే మూడేళ్లలో రూ. 1,400 కోట్ల టర్నోవర్​ టార్గెట్​ అందుకుని, తరువాత ఐపీఓకి రావాలనే ఆలోచనతో ఉన్నట్లు వెల్లడించారు. వందల మందికి నేరుగా, వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలను కల్పించడంలో తాము సక్సెసయ్యామని వివరించారు.

ఇన్​స్టంట్​ బ్రాండింగ్​....

ఒకప్పుడు బ్రాండ్​ క్రియేషన్​ అంటే ఏళ్ల తరబడి కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడలా కాదని, ఇన్​స్టంట్ లేదా ఓవర్​నైట్​​బ్రాండ్​క్రియేషన్ మార్కెట్​కు అవసరమని శ్రీనివాస్​ తెలిపారు. ఈ దిశలో సొంత ఆలోచనలతో బిజినెస్​ మోడల్స్​ను తేనున్నట్లు పేర్కొన్నారు.

ఇన్​సినిమా బ్రాండింగ్​.....

ఇన్​సినిమా బ్రాండింగ్​తో నిర్మాతల ఖర్చు తగ్గించడంతోపాటు, చాలా బెనిఫిట్స్​ ఉంటాయనే కాన్సెప్ట్​ను సినిమా ఇండస్ట్రీకి తాము చేసి, చూపించామని శ్రీనివాస్​ వెల్లడించారు. సినిమా–సినిమా ఇండస్ట్రీ బ్రాండింగ్​లో లీడింగ్​ ప్లేయర్​గా కొనసాగాలనే ఉద్దేశంతో క్రియేటివ్​ ఆలోచనలతో ముందుకు దూసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

సినిమా ఈవెంట్లు, ప్రొడక్షన్​తో బిజీగా ఉన్నా.... తాజా పోకడలనూ అబ్జర్వ్​ చేస్తూనే ఉన్నానని చెబుతూ.... ఓటీటీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సరైన రీతిలో ఎంటర్​ కాబోతున్నట్లు చెప్పారు. అమెజాన్​, నెట్​ఫ్లిక్స్​, ఇతర ఓటీటీలకు భిన్నంగా తమ ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఉంటుందని వివరించారు. మిలినియల్స్​కు ఒక రకమైన కంటెంట్​ ఇష్టమైతే, జనరేషన్​ జెడ్​కు మరో విధమైన కంటెంట్​పసందనే విషయాన్ని తాను స్టడీ చేశానని... ఆయా వర్గాలను ఆకట్టుకునేలా కంటెంట్​ క్రియేషన్​ కోసం భారీ ప్లాన్స్​ చేస్తున్నట్లు చెప్పారు.

ఓటీటీ సెగ్మెంట్లో సబ్​స్క్రిప్షన్​ మోడల్​ కనుమరుగవుతుందని, అందుకే తాము డిఫరెంట్​ స్ట్రేటజీతో రాబోతున్నామని వెల్లడించారు. కంటెంట్​, సినిమా, లైవ్​ కన్సర్ట్స్​,  ఈవెంట్లతో సౌత్​ ఏషియాలోని దేశాలకు విస్తరించి, ఒక కొత్త ఎకో సిస్టమ్​ తెచ్చే ప్రయత్నాలలో ఉన్నట్లు శ్రేయాస్​ మీడియా  శ్రీనివాస్​ చెప్పారు.