భజరే నందగోపాల హరే!
శ్రీకృష్ణ జన్మాష్టమిని సిటీలో ఘనంగా జరిగింది. గ్రేటర్పరిధిలోని ఇస్కాన్, కృష్ణ ఆలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చాలా చోట్ల కాలనీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అందరూ ఒకచోట చేరి ఉట్లు కొట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో మురిసిపోయారు – సిటీనెట్వర్క్, వెలుగు
మియాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో
సోమవారం స్థానిక హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ కమ్యూనిటీ హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం మంగళహారతి, సామూహిక హరేకృష్ణ చాంటింగ్, భాగవతం శ్రవణంతో ఉత్సవం మొదలైంది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ నామ సహస్ర వాలి యజ్ఞం, కలశాభిషేకం నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. రెరా చైర్మన్ సత్యనారాయణ అతిథిగా పాల్గొని బహుమతులు అందచేశారు.
ఆయా కార్యక్రమాల్లో మియాపూర్ ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీరామదాస, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎండోమెంట్ ఆఫీసర్సోమరాజు, స్థానిక ప్రతినిధులు రవి యాదవ్, దేవేందర్ రావు, రాములు, ఇస్కాన్ మెంబర్స్ గోపరాజు శ్రీనివాస్, దేవిశెట్టి శ్రీనివాస్, ఇస్కాన్ ప్రభుజీలు, మాతాజీలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.