ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి : శ్రీను నాయక్

ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి : శ్రీను నాయక్
  • మంత్రి సీతక్కకు కార్మిక సంఘ నేతలు వినతి         

షాద్ నగర్,వెలుగు: రాష్ట్రంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలని వ్యవసాయ, కార్మిక సంఘం నియోజకవర్గ ఇన్ చార్జ్ శ్రీను నాయక్ కోరారు. సోమవారం హైదరాబాద్ లో వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పలు సమస్యలపై రాష్ట్ర మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. అనంతరం శ్రీను నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలని,  గత ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుని కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరారు. సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్ గా గుర్తించాలని, ఉపాధి కార్మికులకు కనీసం రోజుకు కూలి రూ. 600 ఎలాంటి కొలతలు లేకుండా ఇవ్వాలని పేర్కొన్నారు.  మంత్రిని కలిసిన వారిలో వ్యవసాయ, కార్మిక సంఘాల నేతలు ఉన్నారు.