మరిన్ని గోల్డ్​ లోన్లు ఇస్తాం: శ్రీరామ్ ఫైనాన్స్​

హైదరాబాద్​, వెలుగు: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ రాబోయే పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌కు ముందు కస్టమర్లకు తక్కువ వడ్డీతో మరిన్ని గోల్డ్​ లోన్లు ఇచ్చే  లక్ష్యంతో 'జిత్నే సమయ్ కా లోన్ ఉత్నే కా హి బయాజ్' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా తన శాఖల్లో మౌలిక సదుపాయాలను అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసి గోల్డ్ లోన్ శాఖలుగా మార్చడానికి పెట్టుబడి పెడతామని ప్రకటించింది. ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని 304 శాఖల్లో 184 శాఖలు గోల్డ్ లోన్లను అందిస్తున్నాయి.

2025 ఆర్థిక సంవత్సరం  మొదటి క్వార్టర్​లో రూ. 1,273.26 కోట్లు గోల్డ్ లోన్ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో నుంచి వచ్చాయని తెలిపింది.  గోల్డ్ లోన్‌‌‌‌‌‌‌‌ల కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్‌‌‌‌‌‌‌‌లు 'జిత్నే సమయ్ కా లోన్ ఉత్నే కా హి బయాజ్' కార్యక్రమం కింద తక్కువ వడ్డీతో ఏడు రోజుల నుంచి ఏడాది కాలానికి లోన్​ పొందవచ్చని శ్రీరామ్​ ఫైనాన్స్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు అన్నారు.