హైదరాబాద్, వెలుగు: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ టూ వీలర్ లోన్ ఎలిజిబిలిటీ వోచర్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. టూవీలర్‌ను లోన్ ద్వారా కొనాలనుకునే వారి కోసం దీనిని అందుబాటులోకి తెచ్చింది. లోన్ పొందేందుకు అర్హత ఉందా లేదా అనే విషయాన్ని ఈ వోచర్ద్వారా చెక్ చేసుకోవచ్చు. లోన్‌కు అర్హత, మొత్తం, వడ్డీ రేటు వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
కస్టమర్లు శ్రీరామ్ ఫైనాన్స్ వెబ్‌సైట్ లేదా శ్రీరామ్ వన్ యాప్‌లో తాము కొనుగోలు చేయాలనుకుంటున్న వెహికల్ప్రాథమిక వివరాలను ఇవ్వాలి. వెంటనే లోన్ వివరాలూ కనిపిస్తాయి. లోన్ ఎలిజిబిలిటీ వోచర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని డీలర్‌షిప్‌లోని శ్రీరామ్ ఫైనాన్స్ ప్రతినిధికి ఇవ్వాలి. లోన్ 24 గంటలలోపు మంజూరవుతుంది.