విశ్వ నటుడు కమల్ హాసన్ కు నట వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి శృతి హాసన్. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా, కుండ బద్దలు కొట్టేటట్టు మాట్లాడే ఈ భామ.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆమె ముక్కు విషయంలో చాలా కామెంట్స్ వచ్చేవి. ఆ తర్వాత తగ్గిపోయాయి. దానికి కారణం ఆమె సర్జరీ చేయించుకుందనే వార్తలపై తాజాగా ఆమె స్పందించింది. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ.. నిజంగానే తాను ముక్కుకు సర్జరీ చేయించుకున్నానని చెప్పింది. కానీ అది తన అందాన్ని పెంచుకునేందుకేనని స్పష్టం చేసింది.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తన ముక్కును సరిచేయడానికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు స్పష్టం చేసింది. అందంగా కనిపించడం కోసమే అలా చేశానని ఆమె అంగీకరించింది. సర్జరీకి ముందు నా ముక్కు పగిలిపోయి ఉందని, ఇప్పుడు ముఖంలో చాలా తేడా కనిపించిందని తెలిపింది. తాను ఆపరేషన్‌కు ముందు ఆ ముక్కుతోనే మొదటి సినిమా చేశానని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. అంతే కాదు ఇప్పుడు తనముక్కు చాలా స్పష్టంగా ఉందని ఆమె అన్నారు. అందరూ తాను ముక్కు సన్నగా ఉండాలన్న కారణంగా సర్జరీ చేయించుకున్నానని అనుకుంటున్నారు.. కానీ, అది నిజం కాదని, అలా అనడం తనకు బాధ కల్గిస్తుందని చెప్పింది. ఒక వేళ తన ముఖాన్ని అందంగా మలుచుకునే అవకాశం వస్తే.. ఎందుకు చేయించుకోను అన్న శృతి... తను అలాగే కనిపించాలన్న అవసరం ఏమీ లేదని తెలిపింది. దానిపై జస్టిఫై ఇచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. అందాల నటి శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం సలార్ వంటి భారీ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. దీంతో పాటు పలు తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా గడుపుతోంది. వాటికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.