![డెకాయిట్ మూవీ షెడ్యూల్‌లో శృతిహాసన్ జాయిన్](https://static.v6velugu.com/uploads/2024/06/shruti-haasan-joins-decoit-movie-schedule_lIs9ZjD7op.jpg)
అడివి శేష్, శృతిహాసన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డెకాయిట్’. షానీల్ డియో దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. తాజాగా హీరోయిన్ శ్రుతిహాసన్ ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా శ్రుతి, శేష్‌తో కలిసి దిగిన సెల్ఫీని మేకర్స్ షేర్ చేశారు. ఈ షెడ్యూల్‌లో లీడ్ యాక్టర్స్‌పై కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్టు తెలియజేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.