అప్పుడే లగ్జరీ లైఫ్ దూరమైంది.. మెర్సిడెస్ నుంచి లోకల్ ట్రైన్‌కు.. శృతి హాసన్ షాకింగ్ విషయాలు

అప్పుడే లగ్జరీ లైఫ్ దూరమైంది.. మెర్సిడెస్ నుంచి లోకల్ ట్రైన్‌కు.. శృతి హాసన్ షాకింగ్ విషయాలు

కమల్ హసన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి తన చిన్ననాటి విషయాలు పంచుకుంది. తన పేరెంట్స్ విడాకులు తీసుకున్న టైంలోనే తాను జీవిత పాఠం నేర్చుకున్నట్లు పేర్కొంది.

శృతి హాసన్ మాటల్లోనే.. "నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నా లైఫ్ లో ఏం జరిగిందో చాలామందికి తెలియదు. నా పేరెంట్స్ విడిపోయినప్పుడు ఎంతో కుంగిపోయాను. వారిద్దరూ సపరేట్ అయ్యాక నేను అమ్మతోనే ఉన్నాను. అప్పటివరకు ఉన్న జీవితం ఒక్కసారిగా చేంజ్ ఐపోయింది. చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యాం. లగ్జరీ లైఫ్ దూరమైంది. అప్పటివరకూ మెర్చిమెరి బెంజ్ కారులో తిరిగిన నేను లోకల్ ట్రైన్లో జర్నీ చేశాను. రెండు రకాల జీవితాలు చూశాను.

►ALSO READ | Rajinikanth:ఫ్లైట్ని థియేటర్‌గా మార్చిన సూపర్ స్టార్ రజనీకాంత్.. వీడియో వైరల్!

ఇండస్ట్రీకి వచ్చాక నాన్నతో ఎక్కువగా ఉంటున్నాను. విదేశాల్లో మ్యూజిక్ నేర్చుకున్నాను. నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నాను' అంటూ ఎమోషనల్ అయ్యింది.

కాగా.. శ్రుతిహాసన్ పేరెంట్స్ కమల్ హాసన్, సారిక 2004లో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం శ్రుతి 'కూలీ' మూవీలో నటిస్తోంది. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దీన్ని రూపొందిస్తు న్నారు. నాగార్జున, ఉపేంద్ర తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 14న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.