అలా ఏడ్పించేశారేంటీ భయ్యా: CSK ఓటమి.. స్టాండ్స్ లోనే కన్నీళ్లుపెట్టుకున్న స్టార్ హీరోయిన్..

అలా ఏడ్పించేశారేంటీ భయ్యా:  CSK ఓటమి.. స్టాండ్స్ లోనే కన్నీళ్లుపెట్టుకున్న స్టార్ హీరోయిన్..

సీఎస్కేపై సన్ రైజర్స్‌‌ తొలిసారి విజయం అందుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి (ఏప్రిల్ 25న) చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. సొంతగడ్డపై వరుసగా నాలుగు.. మొత్తంగా ఏడో ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్‌‌‌‌ అవకాశాలు దాదాపు ఆవిరయ్యాయి.

ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిని తట్టుకోలేక ఓ స్టార్ హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది. కమలహాసన్ డాటర్ శ్రుతి హాసన్ ఈ మ్యాచ్ కి హాజరై సందడి చేసింది. ఈ అమ్మడు సీఎస్కే టీమ్కు సపోర్ట్ చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఫ్యాన్స్ కేరింతల మధ్య శృతి హాసన్ తన ఉత్సాహం చూపించింది. ధోని క్రీజులోకి అడుగుపెట్టగానే ఒక సాధారణ ఫ్యాన్ గర్ల్లా మారి ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీసి ఎంజాయ్ చేసింది.

కానీ, చివర్లో తనకు ఇష్టమైన జట్టు ఓడిపోవడంతో ఒక్కసారిగా స్టాండ్ లోనే ఏడ్చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ చూడటానికి తమిళ స్థార్ హీరో తల అజిత్, శివ కార్తీకేయన్లు తమ ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేశారు. కానీ వీళ్లకు కూడా నిరాశ తప్పలేదు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. డెవాల్డ్ బ్రేవిస్ (25 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 4 సిక్సర్లతో 42), ఆయుష్ మాత్రమే (19 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లతో 30) పోరాడారు. రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కమిన్స్‌‌‌‌, ఉనాద్కట్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌లో హైదరాబాద్ 18.4  ఓవర్లలో  155/5 స్కోరు చేసి గెలిచింది. ఇషాన్ కిషన్ (34 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 44) రాణించాడు. హర్షల్​కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.