ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలతో ఆకట్టుకుంది శ్రుతిహాసన్. ప్రభాస్‌కి జంటగా ‘సలార్’ లాంటి ప్రెస్టేజియస్ మూవీలో నటిస్తున్న ఆమె.. మరోవైపు నాని సినిమా ‘హాయ్ నాన్న’లో కీలకపాత్ర పోషిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. ఇటీవల పోస్ట్ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతోంది.
‘నేను కొందరిని గమనిస్తుంటాను.. వారు గోతులు తీస్తారు కానీ వాళ్లే అందులో పడిపోతుంటారు. అందుకే అలాంటి వాళ్లను చూసి మౌనంగా నా పని నేను చేసుకుంటాను. కర్మ వాళ్లకు తగిన శిక్ష వేస్తుంది’ అనే అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ చేసింది. ఇందులో ప్రత్యేకంగా ఎవరి పేరు ప్రస్తావించనప్పటికీ ఎవరినో ఉద్దేశించి శ్రుతి ఈ పోస్ట్ చేసిందని అర్థమవుతోంది.
అంతలా ఆమెను ఎవరి ఇబ్బంది పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కర్మ సిద్దాంతం గురించి చెబుతూ ఎవరికో బాగానే కౌంటర్ ఇచ్చింది శ్రుతిహాసన్.