శ్రుతిహాసన్‌ ‘ది ఐ’ మూవీ ట్రైలర్ రిలీజ్.. హాలీవుడ్‎లో హాట్ బ్యూటీ సక్సెస్ అవుతుందా..?

శ్రుతిహాసన్‌  ‘ది ఐ’ మూవీ ట్రైలర్ రిలీజ్.. హాలీవుడ్‎లో హాట్ బ్యూటీ సక్సెస్ అవుతుందా..?

హీరోయిన్ శ్రుతిహాసన్‌‌‌‌ అంతర్జాతీయ స్థాయిలో మెప్పించే ప్రయత్నంలో ఉంది. ఆమె లీడ్‌‌ రోల్‌‌లో ‘ది ఐ’ పేరుతో ఓ ఇంటర్నేషనల్ మూవీ తెరకెక్కింది. డాఫ్నీ ష్మోన్ తెరకెక్కించిన ఈ బ్రిటీష్ సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌ ట్రైలర్‌‌‌‌ను బుధవారం విడుదల చేశారు. ఇందులో డయానా అనే పాత్రలో శ్రుతి నటించింది. 2023లోనే పూర్తయిన ఈ చిత్రం గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో ప్రదర్శితమై ప్రశంసలు దక్కించుకుంది. 

ముంబైలో జరుగుతున్న వెంచ్‌‌ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో గురువారం ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. శ్రుతిహాసన్‌‌తో పాటు మార్క్ రౌలీ, లిండా మార్లో ఇందులో నటించారు. త్వరలో థియేటర్స్‌‌లో ఇది విడుదల కానుంది.