సొంతగడ్డపై తొమ్మిదేళ్ల తర్వాత తొలి టెస్ట్ ఆడుతున్న భారత్ ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత మహిళల జట్టు లంచ్ సమయానికి 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టులో 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా.. రోడ్రిగ్స్, శుభా సతీష్ భారీ భాగస్వామ్యంతో భారత్ ను ఆదుకున్నారు. ప్రస్తుతం శుభా సతీష్ 55 పరుగులతో, రోడ్రీగ్స్ 43 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
ఇంగ్లాండ్ మహిళలకు ఇది 100వ టెస్టు మ్యాచ్. మరోవైపు భారత్ ఇప్పటి వరకు 38 టెస్టులు మాత్రమే ఆడింది. 2014లో భారత్ మహిళల జట్టు సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. భారత మహిళల జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడక రెండేళ్లు దాటిపోయింది. చివరిసారి 2021 సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇటీవలే ఇంగ్లాండ్ పై స్వదేశంలో ఇంగ్లాండ్ పై మన మహిళా క్రికెట్ జట్టు 1-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సొంతగడ్డపై ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత్ ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి. ఇక టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఇంగ్లాండ్‌తో ఆడిన 14 టెస్టుల్లో భారత్ ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. 11 టెస్టులు డ్రా కాగా ఇంగ్లాండ్ ఒక టెస్టులో, ఇండియా 2 టెస్టుల్లో విజయం సాధించింది.
#INDWvsENGW
— News18 CricketNext (@cricketnext) December 14, 2023
Fifty for Jemimah Rodrigues on Test debut
INDW: 166/3 in 33.3 overs
Follow Live: https://t.co/8BnZnFA500