![Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పంజాబ్ సీఎంని కలిసిన స్టార్ క్రికెటర్లు](https://static.v6velugu.com/uploads/2025/02/shubman-gill-and-arshdeep-singh-met-with-the-punjab-chief-minister-bhagwant-mann_9CTzvSRXcg.jpg)
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత స్టార్ ఓపెనర్.. వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కలిశారు. శుక్రవారం (ఫిబ్రవరి 14) గిల్, అర్షదీప్ సింగ్ తమ ఫ్యామిలీతో రాష్ట్ర సీఎం కలిసి క్రికెట్ గురించి ఛాంపియన్స్ ట్రోఫీ గురించి చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రితో ఈ సమావేశం గిల్, అర్షదీప్ సింగ్ లకు మనోధైర్యాన్ని పెంచుతుంది. పంజాబ్ తరపున గిల్, అర్షదీప్ అత్యుత్తమ క్రికెటర్లు. వీరిద్దరూ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం గిల్ భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు అర్షదీప్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్ తో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరూ కూడా సూపర్ ఫామ్ లో ఉండడం భారత్ కు కలిసి వచ్చేదే. ఇటీవలే ఇంగ్లాండ్ తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో గిల్ సెంచరీ చేసి వన్డేల్లో ఫాస్టెస్ట్ 2500 పరుగుల రికార్డ్ నెలకొల్పాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 259 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.
మరోవైపు అర్షదీప్ సింగ్ ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో 100 వికెట్లను పూర్తిచేసుకున్న తొలి భారత ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. ఆదివారం (ఫిబ్రవరి 16) లేదా సోమవారం భారత జట్టు ఈ మెగా టోర్నీ కోసం దుబాయ్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధోనీ కెప్టెన్సీలో భారత్ 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత 2017 లో కోహ్లీ కెప్టెన్సీలో పాకిస్థాన్ చేతిలో ఫైనల్లో ఓడిపోయింది. ఈ సారి రోహిత్ కెప్టెన్సీలో బలంగా ఉన్న భారత జట్టు ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫి గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగాలని చూస్తుంది.
ALSO READ | PAK vs NZ: వన్డేల్లో బాబర్ వండర్.. కోహ్లీని వెనక్కి నెట్టి ప్రపంచ రికార్డ్
వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్, భారత్ జట్లు తప్ప మిగిలిన దేశాలు తన స్క్వాడ్ లను ప్రకటించాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఫిబ్రవరి 23 న మ్యాచ్ జరుగుతుంది.
ਅੱਜ ਦੇਸ਼ ਅਤੇ ਪੰਜਾਬ ਦਾ ਮਾਣ ਵਧਾਉਣ ਵਾਲੇ ਮਾਣਮੱਤੇ ਖਿਡਾਰੀ ਭਾਰਤੀ ਕ੍ਰਿਕੇਟ ਟੀਮ ਦੇ ਉੱਪ ਕਪਤਾਨ ਸ਼ੁਭਮਨ ਗਿੱਲ ਅਤੇ ਤੇਜ਼ ਗੇਂਦਬਾਜ ਅਰਸ਼ਦੀਪ ਸਿੰਘ ਪਰਿਵਾਰ ਸਮੇਤ ਮਿਲਣ ਆਏ। ਮਿਲ ਕੇ ਬਹੁਤ ਚੰਗਾ ਲੱਗਿਆ।
— Bhagwant Mann (@BhagwantMann) February 14, 2025
Champion Trophy 2025 ਲਈ ਦੋਵਾਂ ਖਿਡਾਰੀਆਂ ਨੂੰ ਸ਼ੁੱਭਕਾਮਨਾਵਾਂ। ਪੂਰੇ ਪੰਜਾਬ ਨੂੰ ਤੁਹਾਡੇ 'ਤੇ ਮਾਣ ਹੈ।
.........
आज देश… pic.twitter.com/WnwXf0bX9J