IND vs AUS: మూడో వన్డేలో ఆ ఇద్దరికీ రెస్ట్..కోహ్లీ, రోహిత్ పరిస్థితి ఏంటి..?

IND vs AUS: మూడో వన్డేలో ఆ ఇద్దరికీ రెస్ట్..కోహ్లీ, రోహిత్ పరిస్థితి ఏంటి..?

స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ లో భాగంగా టీమిండియా సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. మొహాలీలో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. నిన్న ఇండోర్ లో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల భారీ విజయంతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్లేయర్లకు విశ్రాంతి ప్రకటించింది. 
 
మూడో వన్డేకు గిల్,శార్దూల్ ఠాకూర్‌ ఔట్ 

ఫామ్ లో ఉన్న ఓపెనర్ శుభమన్ గిల్, బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ కి మూడో వన్డేలో టీమిండియా  విశ్రాంతినిచ్చింది. చివరి వన్డే కావడంతో కావడంతో అందరికీ ప్రాక్టీస్ కల్పించే ఉద్దేశ్యంలో వీరిద్దరి స్థానాల్లో రోహిత్ శర్మ, కోహ్లీ వచ్చి చేరే అవకాశం ఉంది. ఇక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ని ఆడిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కుల్దీప్ కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే జడేజాకు రెస్ట్ ఇవ్వొచ్చు. హార్దిక్ వస్తే గైక్వాడ్ తప్పుకోవాల్సిందే. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని కారణంగా ఈ మ్యాచ్ ఆడట్లేదు.   

Also Read : ఛాంపియన్‌ జట్టుని పసికూనగా మార్చిన టీమిండియా.. ఆసీస్‌పై సరికొత్త రికార్డులు

మరోవైపు ఈ మ్యాచులో ఆసీస్ మిచెల్ స్టార్క్, మ్యాక్స్ వెల్ తుది జట్టులోకి రాబోతున్నారు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈ నెల 27 న రాజ్ కోట్ వేదికగా జరగనుంది. మరి ఈ మ్యాచులో కూడా గెలిచి భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందా..? లేకపోతే ఆసీస్ బోణీ కొడుతుందేమో చూడాలి. ఈ సిరీస్ అనంతరం వారం తర్వాత అక్టోబర్ 5 న వరల్డ్ కప్ జరగనుంది.           

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)