Shubman Gill: లోక్‌సభ ఎలక్షన్స్.. పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా గిల్

Shubman Gill: లోక్‌సభ ఎలక్షన్స్.. పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా గిల్

పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం భారత క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌ను స్టేట్ ఐకాన్ గా  నియమించింది. 70 శాతం ఓటింగ్ ఉండేలా ఓటరుపై అవగాహన కల్పించేందుకు గిల్ పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిబిన్ సి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం పోల్ ప్యానెల్ 'ఈజ్ వార్ 70 పార్' లక్ష్యాన్ని నిర్దేశించింది.

పంజాబ్‌లో 13 స్థానాలకు జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 65.96 ఓటింగ్ నమోదైంది. క్రీడల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన గిల్ "స్టేట్ ఐకాన్"గా నియమించబడ్డారని CEO చెప్పారు. పంజాబ్‌లోని డిప్యూటీ కమిషనర్లతో శుక్రవారం (ఫిబ్రవరి 16) జరిగిన సమావేశంలో గత ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని కోరినట్లు సిబిన్ సి తెలిపారు. ఇలాంటి ప్రాంతాల్లో శుభ్‌మన్ గిల్ చేస్తున్న అవగాహన ప్రచారాలు ఓటర్లను చైతన్యవంతం చేయడంతో పాటు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయని ఆయన అన్నారు.

ఇంతకుముందు, ప్రముఖ పంజాబీ గాయకుడు టార్సెమ్ జస్సర్‌ను 'స్టేట్ ఐకాన్'గా ఎంపిక చేశారని, ఆయన కూడా ఇలాంటి ప్రచారాలను నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏడాది కాలంగా గిల్ అత్యున్నత ఫామ్ లో ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా నిలకడగా రాణిస్తూ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం గిల్ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. తొలి టెస్టులో విఫలమైనా.. ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లో సెంచరీ, అర్ధ సెంచరీతో రాణించాడు.