IND vs AUS: చేతివేలికి గాయం.. తొలి టెస్టుకు భారత యువ బ్యాటర్ దూరం

IND vs AUS: చేతివేలికి గాయం.. తొలి టెస్టుకు భారత యువ బ్యాటర్ దూరం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. యువ బ్యాటర్ శుభమాన్ గిల్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా ఏ తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గిల్ కు గాయమైనట్టు తెలుస్తుంది. స్లిప్ లో క్యాచ్ పట్టే క్రమంలో గిల్ చేతి వేళ్ళకు గాయమైంది. దీంతో అతడు తొలి టెస్ట్ ఆడేది అనుమానంగా మారింది. గిల్ గాయంపై బీసీసీఐ త్వరలో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

ఇప్పటికే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన సంగతి తెలిసిందే. ఫామ్ లో ఉన్న గిల్ కూడా దూరమైతే భారత్ బ్యాటింగ్ ఈ మ్యాచ్ లో మరింత బలహీనంగా మారే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మూడో స్థానంలో ఎవరు ఆడతారనే విషయంలో సందిగ్ధత నెలకొంది. గిల్ కు గాయమైతే తుది జట్టులో సర్ఫరాజ్, రాహుల్ ఆడడం పక్కాగా కనిపిస్తుంది. అయితే వీరి బ్యాటింగ్ స్థానాలు ఎక్కడ అనేవి ఆసక్తికరంగా మారింది. 

ALSO READ | IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్.. టీమిండియా తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ప్రస్తుతం భారత జట్టు దృష్టి మొత్తం ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై ఈ సిరీస్ ను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌పై భారత్ 3-0తో వైట్‌వాష్ అయిన తర్వాత రోహిత్ సేన టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే, ఆస్ట్రేలియా ప‌ర్యట‌న‌ చావో రేవో లాంటిది. బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీని 5-0 లేదా 4-0 తేడాతో సిరీస్ ద‌క్కించుకుంటే, తప్ప ముందుకెళ్లే దారుల్లేవ్.