ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు తమ హవా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా యువ సంచలనం శుభమాన్ గిల్ వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. గిల్ ఖాతాలో ప్రస్తుతం 830 రేటింగ్ పాయింట్లు ఉంటే.. బాబర్ ఖాతాలో 824 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ లో గిల్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్నా బాబర్ అజామ్ సరిగా ఆడలేకపోవడం గిల్ కు కలిసి వచ్చింది.
గత ఏడాది నుంచి నెంబర్ వన్ వన్డే బ్యాటర్ గా కొనసాగుతున్న బాబర్ చాలా రోజుల తర్వాత తన టాప్ ర్యాంక్ ను గిల్ కోల్పోయాడు. ఈ ఏడాది 26 వన్డేల్లో 63.00 సగటుతో 1149 పరుగులు చేసిన గిల్ స్ట్రైక్ రేట్ 100 కు పైగానే ఉంది. శ్రీలంకపై వాంఖడేలో 92 పరుగులు చేసిన గిల్ ఈ ప్రదర్శనతో బాబర్ ను దాటేశాడు. ఇక బౌలింగ్ లో సిరాజ్ టాప్ ర్యాంక్ కు దూసుకొచ్చాడు. వరల్డ్ కప్ ప్రారంభంలో అంచనాలకు మించి రాణించని సిరాజ్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ దగ్గర నుంచి చెలరేగుతున్నాడు. ఇదే ఫామ్ ను శ్రీలంక, సౌత్ ఆఫ్రికా మీద కొనసాగించి పాక్ పేస్ బౌలర్ షాహీన్ అఫ్రిదీను వెనక్కి నెట్టాడు.
- ALSO READ | Cricket World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. ఓడితే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్
టీమిండియా నుంచి స్టార్ బ్యాటర్ కోహ్లీ 4, రోహిత్ 6 వ ర్యాంక్ నిలిచారు. బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ 4, బుమ్రా 8, షమీ 10 వ స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఉన్న నలుగురు బౌలర్లు టాప్-10 లో ఉండడం విశేషం. ఇక వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. టీ 20 ల్లో సూర్య కుమార్ యాదవ్ నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతుండగా.. అశ్విన్ టెస్టుల్లో టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. టెస్టు ఆల్ రౌండర్లలో జడేజా మొదటి ర్యాంక్ లోనే ఉన్నాడు.
BCCI's poster on Shubman Gill becomes No.1 ODI Batsman in the World.
— Sports News Cricket (@sports_new92609) November 8, 2023
- The Prince Of World Cricket. pic.twitter.com/zytYhljv2U