
చెన్నై : గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీ జరిమానా పడింది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి రూ. 12 లక్షల ఫైన్ విధించారు. నిర్ణీత టైమ్‌లో వేయాల్సిన ఓవర్ల కోటాను గిల్ బృందం పూర్తి చేయలేకపోయిందని
అందుకే చర్యలు తీసుకున్నామని ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. మరోసారి ఇది పునరావృతమైతే ఓ మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 63 రన్స్ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.