SRH vs MI: ఐపీఎల్ రూల్ బ్రేక్.. గిల్‌కు భారీ జరిమానా

SRH vs MI: ఐపీఎల్ రూల్ బ్రేక్.. గిల్‌కు భారీ జరిమానా

టీమిండియా యువ ఆటగాడు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు ఊహించని షాక్ తగిలింది. అతనికి 12 లక్షల జరిమానా విధించారు. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదు. దీంతో ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవరించిన కెప్టెన్ గిల్ ను స్లో ఓవర్ రేట్ కింద పనిష్ చేశారు. ఈ సీజన్ లో ఇదే తొలి స్లో ఓవర్ రేట్ కావడం విశేషం. ఇప్పటివరకు మొత్తం 8 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి.
 
ఈ మ్యాచ్ లో గిల్ కెప్టెన్సీతో పాటు బ్యాటర్ గాను విఫలమయ్యాడు. తొలి బంతికే సిక్సర్ కొట్టి మంచి టచ్ లో కనిపించినా 8 పరుగులకే ఔటయ్యాడు. హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ జట్టులో చేరడంతో గిల్ తొలి సారి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ బాధ్యతలు ఈ యువ బ్యాటర్ కు అప్పగించారు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ లో తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నా.. నిన్న (మార్చి 26) చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ప్రభావం చూపించలేకపోయాడు.

Also Read:హిట్ మ్యాన్‌లో ఇది ఊహించలేదే: మయాంక్‌ను ఆటపట్టించిన రోహిత్

మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 63 రన్స్‌‌ తేడాతో గుజరాత్‌‌ టైటాన్స్‌‌ను ఓడించింది. మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 63  టాస్‌‌ ఓడిన చెన్నై 20 ఓవర్లలో 206/5 స్కోరు చేసింది. బ్యాటింగ్‌‌లో శివమ్‌‌ దూబె (51), రుతురాజ్‌‌ (46), రచిన్‌‌ రవీంద్ర (46) మెరుపులు మెరిపించారు. లక్ష్య ఛేదనలో గుజరాత్‌‌ 20 ఓవర్లలో 143/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. సాయి సుదర్శన్‌‌ (31) టాప్‌‌ స్కోరర్‌‌. సాహా (21), మిల్లర్‌‌ (21) కాసేపు పోరాడినా సీఎస్కే బౌలర్లు చాన్స్‌‌ ఇవ్వలేదు. శివమ్‌‌ దూబెకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.