GT vs CSK: అవార్డు గెలిచినా ఫైన్ తప్పలేదు: గిల్‌కు బీసీసీఐ భారీ జరిమానా

GT vs CSK: అవార్డు గెలిచినా ఫైన్ తప్పలేదు: గిల్‌కు బీసీసీఐ భారీ జరిమానా

టీమిండియా యువ ఆటగాడు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు ఊహించని షాక్ తగిలింది. రెండోసారి స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు గిల్ కు రూ. 24 లక్షల జరిమానా విధించబడింది. శుక్రవారం (మే 10) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదు. దీంతో ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవరించిన కెప్టెన్ గిల్ ను స్లో ఓవర్ రేట్ కింద పనిష్ చేశారు. ఈ సీజన్ లో గిల్ కు స్లో ఓవర్ రేట్ విధించడం ఇది రెండో సారి. 

కెప్టెన్ గిల్ త పాటు గుజరాత్ జట్టులోని ఆటగాళ్లకు కూడా జరిమానా విధించారు. జట్టులోని ప్లేయింగ్ 11 లో ఉన్న వారికి  రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించబడింది. గిల్ మరోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్షకు గురయితే 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. ఈ సీజన్ లో చెన్నైతో జరిగిన మ్యాచ్ లో తొలిసారి స్లో ఓవర్ రేట్‌తో 12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన గిల్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. 

ఏ మ్యాచ్ విషయానికి వస్తే.. సొంతగడ్డపై గుజరాత్ చెన్నైపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో చెన్నై పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 35 పరుగుల తేడాతో గుజరాత్ కీలక విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులకు పరిమితమైంది. ఈ విజయంతో గుజరాత్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.