IND vs AUS: గిల్ అత్యుత్సాహం.. హెడ్ క్యాచ్ అందుకున్న వెంటనే అంపైర్ వార్నింగ్

IND vs AUS: గిల్ అత్యుత్సాహం.. హెడ్ క్యాచ్ అందుకున్న వెంటనే అంపైర్ వార్నింగ్

దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో టీమిండియా వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో తొమ్మిదో ఓవర్ రెండో బంతిని భారీ షాట్‌కు యత్నించి హెడ్‌.. గిల్‌ చేతికి చిక్కాడు. హెడ్ లాంగాఫ్ దిశగా కొట్టిన ఈ షాట్ ను గిల్ పరిగెత్తుకుంటూ వస్తూ క్యాచ్ అందుకున్నాడు. అద్భుతంగా పట్టిన ఈ క్యాచ్ తో గిల్ ఒక్కసారిగా  హీరో అయిపోయాడు. అయితే అంపైర్ చేతిలో మాత్రం వార్నింగ్ తప్పలేదు. 

పరిగెత్తుకుంటూ క్యాచ్ అందుకున్న గిల్ బంతిని కాసేపైనా చేతిలో ఉంచుకోకుండా వెంటనే కిందకి పడేశాడు. క్యాచ్ సరిగానే అందుకున్నప్పటికీ అంపైర్ ఓవర్ తర్వాత గిల్ ను దగ్గరకు పిలిచి బంతిని కాసేపైనా చేతిలో ఉంచుకోమని సూచించాడు. భవిష్యత్తులో గిల్ అత్యుత్సాహం వలన క్యాచ్ మిస్ చేసే అవకాశం ఉందని నెటిజన్స్ జాగ్రత్త చెబుతున్నారు. ఏమైనప్పటికీ గిల్ క్యాచ్ తో 54 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది.

ప్రమాదకర ట్రావిస్ హెడ్ (39; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔటయ్యాడు. బౌండరీలతో విరుచుకు పడుతూ జోరు మీదున్న ట్రావిస్‌ హెడ్‌ (39)ను వరుణ్‌ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్ స్మిత్ తో పాటు ట్రావిస్ హెడ్ రాణించడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా 37 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. క్రీజ్ లో అలెక్స్ క్యారీ (39), మ్యాక్స్ వెల్ (1) ఉన్నారు. హెడ్ ఉన్నంతసేపు వేగంగా ఆడి 33 బంతుల్లో 39 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔటయ్యాడు. కొనొల్లి(0), ఇంగ్లీస్ (11) విఫలమయ్యారు, లబు షేన్ 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. భారత్ బౌలర్లలో జడేజా, షమీ రెండు వికెట్లు తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ లభించింది.