వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో యువ సంచలనం శుభమన్ గిల్ అదరగొట్టేస్తున్నాడు. న్యూజిలాండ్ పై జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో 41 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసాడు. ప్రారంభంలో రోహిత్ విధ్వంసానికి శాంతించిన గిల్.. ఆ తర్వాత తన బ్యాట్ వేగాన్ని పెంచాడు. ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ బౌలింగ్ లో సిక్సర్, ఫోర్ కొట్టిన గిల్ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. 14 వ ఓవర్లలో రచీన్ రవీంద్ర బౌలింగ్ లో సింగల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
గిల్ కి ఈ టోర్నీలో ఇది నాలుగో హాఫ్ సెంచరీ కాగా.. ఓవరాల్ గా వన్డేల్లో 13 వ హాఫ్ సెంచరీ. కాగా.. గిల్ హాఫ్ సెంచరీ అనంతరం సార్ చప్పట్లు కొట్టడం ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ ఆరంభంలో రోహిత్ ధాటికి కివీస్ బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. రోహిత్ 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో నాలుగు సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉండటం విశేషం. ప్రస్తుతం భారత్ 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (63) కోహ్లీ (19) ఉన్నారు.