ODI World Cup 2023: ప్రమాదంలో బాబర్ అజాం టాప్ ర్యాంక్.. నెంబర్ వన్‌కు చేరువలో గిల్

ODI World Cup 2023: ప్రమాదంలో బాబర్ అజాం టాప్ ర్యాంక్.. నెంబర్ వన్‌కు చేరువలో గిల్

టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్.. వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకునే పనిలో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోయినా బాబర్ అజాం చెత్త ఫామ్ గిల్ కు కలిసి వచ్చింది. ప్రస్తుతం గిల్ ఖాతాలో 816 పాయింట్లు ఉంటే పాక్ కెప్టెన్ ఖాతాలో 818 పాయింట్లు ఉన్నాయి. నేడు శ్రీలంకపై జరిగే మ్యాచ్ లో గిల్ 30 పైగా పరుగులు చేస్తే వన్డేల్లో తొలిసారి నెంబర్ వన్ బ్యాటర్ గా గిల్ అవతరిస్తాడు. 

ఈ ఏడాది మొత్తం 24 వన్డే మ్యాచ్ లాడిన గిల్..1334 పరుగులు చేసాడు. యావరేజ్ 63 గా ఉంటే.. స్ట్రైక్ రేట్ 100 ఉంది. వరల్డ్ కప్ ముందు జరిగిన ఆసియా కప్ లో 302 పరుగులు చేసిన గిల్ ఈ టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. కానీ ఇదే టోర్నీలో బాబర్ అజామ్ 216 పరుగులు మాత్రమే చేసాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో టాప్ లో ఉన్న డికాక్  765 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 5 వ స్థానంలో, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 7 వ స్థానంలో నిలిచారు. 

ALSO READ :- ODI World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న శ్రీలంక.. గెలిస్తే సెమీస్‌కు భారత్

ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే గిల్.. 4 మ్యాచ్ ల్లో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేసాడు. డెంగ్యూతో తొలి రెండు మ్యాచ్ లకు దూరమైన గిల్.. కోలుకొని జట్టులోకి వచ్చి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇక బౌలింగ్ విషయంలో భారత్ నుంచి సిరాజ్, కుల్దీప్ యాదవ్ టాప్-10 లో చోటు దక్కించుకున్నారు. సిరాజ్ మూడో స్థానంలో ఉంటే.. కుల్దీప్ యాదవ్ 7 స్థానాల్లో నిలిచాడు.      

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)