ఎవరిని ప్రేమించట్లే.. మూడేండ్లుగా సింగిల్‌‌‌‌ గానే ఉన్నా: శుభమన్ గిల్

ఎవరిని ప్రేమించట్లే.. మూడేండ్లుగా సింగిల్‌‌‌‌ గానే ఉన్నా: శుభమన్ గిల్

అహ్మదాబాద్‌‌‌‌: తాను ఎవ్వరితో ప్రేమలో పడలేదని, మూడేండ్లుగా సింగిల్‌‌‌‌గా ఉన్నానని టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్ గిల్ చెప్పాడు. బాలీవుడ్ యాక్టర్‌‌‌‌‌‌‌‌, ఓ క్రికెటర్ కూతురుతో ప్రేమలో ఉన్నట్టు వస్తున్న పుకార్లను ఖండించాడు. తన రిలేషన్‌‌‌‌షిప్ స్టేటస్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో గిల్ క్లారిటీ ఇచ్చాడు.  ‘నేను మూడు సంవత్సరాలకు పైగా సింగిల్‌‌‌‌గా ఉన్నాను. నా విషయంలో చాలా ఊహాగానాలు, పుకార్లు వచ్చాయి. 

నన్ను పలువురితో లింక్ చేస్తూ వార్తలు, పుకార్లు సృష్టిస్తున్నారు. అవి కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకుంటే నేను రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఉన్నట్టు చెబుతున్న ఆ వ్యక్తిని  ఎప్పుడూ చూడలేదు.. కలవలేదు. నేను ఈ వ్యక్తితో, ఆ వ్యక్తితో ఉన్నానని పుకార్లు వినిపిస్తే ఒక్కోసారి ఆశ్చర్యపోతాను’ అని గిల్ పేర్కొన్నాడు. మ్యాచ్ కోసం ఒకసారి గ్రౌండ్‌‌‌‌లోకి వచ్చాక తాను వేరే జోన్‌‌‌‌లోకి వెళ్లిపోతానని శుభ్‌‌‌‌మన్ చెప్పాడు. 

ప్రేక్షకుల అరుపులు, కేకలు అస్సలు పట్టించుకోనని తెలిపాడు. ‘మ్యాచ్ సమయంలో పూర్తిగా వేరే జోన్‎లోకి వెళ్తాను. ప్రేక్షకుల చీర్స్, కేకలు ఏమీ వినిపించవు. నేను ఏ బౌలర్‌‌‌‌ను ఎదుర్కొంటున్నాను.. ఎంత స్కోరు చేయాలనే దానిపైనే ఫోకస్ ఉంటుంది. నా విషయంలో ఇది ఒక ఆటోమేటిక్ స్విచ్‌‌‌‌లా పనిచేస్తుంది. గ్రౌండ్‌‌‌‌లో ఉన్నప్పుడు బయటి ప్రపంచం మొత్తం నిశ్వబ్దంగా అనిపిస్తుంది’ గిల్ చెప్పుకొచ్చాడు.