
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆదివారం (మార్చి 2) న్యూజిలాండ్ తో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే భారత్ వరుసగా రెండు విజయాలతో సెమీస్ కు చేరుకుంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా వరుసగా రెండు విజయాలతో సెమీస్ కు అర్హత సాధించింది. దీంతో ఆదివారం ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ నామమాత్రంగా మారనుంది. గెలిచిన జట్టు గ్రూప్ ఏ టేబుల్ టాపర్ గా సెమీస్ లోకి అడుగుపెడుతుంది. గాయం కారణంగా ఈ మ్యాచ్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
ALSO READ : Epic Victory Cricket League: 6 జట్లు, 18 మ్యాచ్‌లు.. భారత క్రికెట్‌లో మరో కొత్త లీగ్
రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్ లో కూడా హిట్ మ్యాన్ కనిపించలేదట. ఆదివారం(ఫిబ్రవరి 23) దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రోహిత్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్ నుంచి కాసేపు వెళ్ళిపోయాడు. రోహిత్ గాయంపై ఎలాంటి అప్ డేట్ లేదు. కివీస్ తో జరగనున్న నామమాత్రపు మ్యాచ్ కు రోహిత్ ను ఆడించే ఆలోచనలో జట్టు యాజమాన్యం లేనట్టు తెలుస్తుంది. రిస్క్ తీసుకోకుండా ఈ మ్యాచ్ లో రోహిత్ కు రెస్ట్ ఇస్తే అతను సెమీ ఫైనల్ సమయానికి తాజాగా ఉంటాడు.
రోహిత్ శర్మ దూరమైతే ఈ మ్యాచ్ కు శుభమాన్ గిల్ కెప్టెన్సీ చేసే అవకాశముంది. ఛాంపియన్స్ ట్రోఫీకి గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అదే జరిగితే ఓపెనర్ యూతె రాహుల్ ను ఓపెనర్ గా బరిలోకి దిగొచ్చు. ఈ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలకు సైతం రెస్ట్ ఇవ్వొచ్చు. అర్షదీప్ సింగ్, వాషింగ్ టన్ సుందర్ లకు ఛాన్స్ దక్కొచ్చు.