టీమిండియా జట్టు బాగున్నా ఐసీసీ టోర్నీలంటే అదృష్టం కలిసి రావడం లేదు. 2013 లో చివరిసారి ఇక ట్రోఫీ గెలిచినా టీమిండియా ఆ తర్వాత నాకౌట్ సమరానికి వెళ్తున్న టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమవుతుంది. ఈ క్రమంలో 2014 టీ 20 వరల్డ్ కప్ ఫైనల్, 2016 టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్,2015,2019 లో వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ,గతేడాది జరిగిన టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ సారి భారత్ లో వరల్డ్ కప్ జరుగుతుండడంతో అభిమానులు భారీగా అంచనాలే పెంచేసుకున్నాడు.స్వదేశంలో భారత్ వరల్డ్ గెలవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. దీనికి తగ్గట్లే ఇప్పుడు ఒక సెంటిమెంట్ టీమిండియాను ఊరిస్తుంది. అదేంటో కాదు భారత జట్టులో ఉన్న ఒక ప్లేయర్ అడుగుపెడితే టైటిల్ గెలవడం పక్కా అని తెలుస్తుంది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో కాదు. టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్.
మొన్నటి వరకు అదృష్టమంటే ధోనీదే అనుకున్నారు. కానీ గిల్ అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే టైటిల్ గెలిచేస్తున్నాడు. భారత్ కి 2018 లో అండర్-19 ట్రోఫీ అందించిన గిల్.. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వచ్చి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక తాజాగా ఆసియా కప్ గెలిచిన జట్టులో కూడా గిల్ ఉండడం విశేషం. ఈ రకంగా చూసుకుంటే గిల్ ఖాతాలో వన్డే వరల్డ్ కప్ చేరడం ఖాయంగా కనిపిస్తుంది. పైగా గిల్ ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్నాడు. మొత్తానికి సెంటిమెంట్ పరంగా చూసుకున్నా వరల్డ్ కప్ మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.