టీమిండియా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ ను అన్ని ఫార్మాట్ లలో వైస్ కెప్టెన్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అతను ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో 'ఏ' జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. ఇటీవలే ముగిసిన శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ కు గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే నివేదికల ప్రకారం గిల్ కు టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందట. బుమ్రా గైర్హాజరీతో బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు గిల్ నే వైస్ కెప్టెన్ గా ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Also Read:-బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. 3-1 తేడాతో ఆ జట్టే విజేతగా నిలుస్తుంది
బీసీసీఐ ఈ యువ అతడిని భవిష్యత్ కెప్టెన్ గా చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో భారత్ సెప్టెంబర్ 19 నుంచి రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు గిల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోందట. సెలెక్టర్లు జట్టును ప్రకటించినప్పుడు బుమ్రా స్థానంలో గిల్ కొత్త వైస్ కెప్టెన్‌గా మారే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.
రెండేళ్ల నుంచి గిల్ తన బ్యాటింగ్ తో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. దీంతో అతన్ని ఇటీవలే ముగిసిన జింబాబ్వే టూర్ కు యువ భారత జట్టుకు కెప్టెన్ గా ప్రకటించారు. ఈ సిరీస్ లో భారత్ 4-1 తేడాతో సిరీస్ గెలిచింది. శ్రీలంకతో జరగబోయే సిరీస్ కు గిల్ ను టీ20, వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. వన్డే, టెస్టుల్లో రోహిత్.. టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్ భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.