IND vs NZ 2024: తొలి టెస్టుకు గిల్ దూరం..? సర్ఫరాజ్‌కు లైన్ క్లియర్

IND vs NZ 2024: తొలి టెస్టుకు గిల్ దూరం..? సర్ఫరాజ్‌కు లైన్ క్లియర్

న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ రేపు (అక్టోబర్ 16) తొలి టెస్ట్ మ్యాచ్ కు సిద్ధమవుతుంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. స్వదేశంలో తిరుగులేని రికార్డ్ ఉన్న భారత్ ను కివీస్ ఎలా తట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ కు వర్షం రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే యువ ఆటగాడు శుభమాన్ గిల్ దూరం కానున్నాడని సమాచారం. 

ప్రాక్టీస్ సెషన్ లో గిల్ మెడకు గాయమైంది. దీంతో మెడ భాగంలో కట్టు కట్టుకున్నాడు. ఆడేది స్వదేశంలోనే కాబట్టి గిల్ ను ఆడించే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. అదే జరిగితే దేశవాళీ క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న సర్ఫరాజ్ కు అవకాశం దక్కుతుంది. ఇటీవలే ముగిసిన ఇరానీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. ప్రస్తుతం టీమిండియా స్క్వాడ్ లో బ్యాటర్ గా సర్ఫరాజ్ మాత్రమే ఉన్నాడు. దీంతో అతని రాక ఖాయంగా కనిపిస్తుంది. అతను ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. 

ALSO READ | PAK vs ENG 2024: బాబర్ స్థానానికి ఎసరు.. సెంచరీతో పాక్‌ను నిలబెట్టిన కమ్రాన్ గులామ్

ఇదే సమయంలో గిల్ ఆడే మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. నాలుగో స్థానంలో ఆడే విరాట్ కోహ్లీ నెంబర్ 3 లో ఆడతాడా..? లేకపోతే రాహుల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపిస్తారేమో చూడాలి. రోహిత్ శర్మ, జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ మరో 8 టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం నాలుగు మ్యాచ్ ల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా టీమిండియా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుతుంది.