IND vs ENG: సెంచరీతో రెచ్చిపోయిన గిల్.. మూడు రికార్డ్స్ ఔట్

IND vs ENG: సెంచరీతో రెచ్చిపోయిన గిల్.. మూడు రికార్డ్స్ ఔట్

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో వన్దేలో టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. సొంతగడ్డపై రెచ్చిపోతూ ఈజీగా ఇంగ్లాండ్ బౌలర్లను ఆడేశాడు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఓవరాల్ గా 102 బంతుల్లో 112 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. గిల్ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. వన్డే కెరీర్ లో గిల్ కు ఇది 7 వ సెంచరీ కావడం విశేషం. 

ఈ మ్యాచ్ లో గిల్ తన 2500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో వన్డే క్రికెట్ లో వేగంగా 2500 పరుగులు చేసిన బ్యాటర్ గా గిల్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. అంతకముందు సౌతాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఈ రికార్డ్ ఉంది. ఆమ్లా 53 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.. కాగా గిల్ కు 50 ఇన్నింగ్స్ లే అవసరమయ్యాయి. ఒకే గడ్డపై మూడు ఫార్మాట్ లలో సెంచరీ పూర్తి చేసుకున్న అరుదైన లిస్టులో గిల్ చేరాడు. అహ్మదాబాద్ లో గిల్ మూడు ఫార్మాట్ లలో సెంచరీ బాదాడు. ఓవరాల్ గిల్ కంటే ముందు నలుగురు ఈ ఘనతను అందుకున్నారు. 

వన్డేల్లో వేగంగా 7 సెంచరీలు చేసిన ప్లేయర్ గా గిల్ మరో రికార్డ్ నెలకొల్పాడు. గిల్ సెంచరీతో పాటు విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ప్రస్తుతం 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235పరుయిగులు చేసింది. క్రీజ్ లో అయ్యర్(68), రాహుల్ (2) ఉన్నారు. గత మ్యాచ్ లో సెంచరీ హీరో రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఒక పరుగే చేసి ఔటయ్యాడు.