న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను నియమించింది. పాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్లిపోవడంతో గిల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో అతను టైటాన్స్ టీమ్‌ను నడిపిస్తాడని సోమవారం స్పష్టం చేసింది. గత సీజన్‌లో 890 రన్స్ చేసిన గిల్.. విరాట్ కోహ్లీ (973) తర్వాత రెండో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ‘గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినందుకు గర్వంగా, సంతోషంగా ఉంది.
ఇంత మంచి టీమ్‌ను నడిపించే బాధ్యతను నాపై పెట్టినందుకు ఫ్రాంచైజీకి ధన్యవాదాలు. మేం రెండుసార్లు అసాధారణంగా ఆడి ఫైనల్స్‌కు చేరాం. మరోసారి అదే స్థాయిలో టీమ్‌ను నడిపించేందుకు ప్రయత్నిస్తా. వచ్చే సీజన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని గిల్ పేర్కొన్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ టీమ్‌లోకి వెళ్లడంపై హార్దిక్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఇది చాలా అద్భుతమైన జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది. ముంబై, వాంఖడే, పల్టాన్‌కు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని పాండ్యా ట్విటర్‌లో రాసుకొచ్చాడు. హార్దిక్ రాకను ముంబై ఇండియన్స్ ఓనర్స్ కూడా స్వాగతించారు.