Ranji Trophy 2025: గిల్ వీరోచిత సెంచరీ వృధా.. పంజాబ్ ఘోర ఓటమి

Ranji Trophy 2025: గిల్ వీరోచిత సెంచరీ వృధా.. పంజాబ్ ఘోర ఓటమి

రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ టీమిండియా ఆటగాడు శుభమాన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. కర్ణాటకపై జరిగిన మ్యాచ్ లో వీరోచిత సెంచరీ చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 పరుగులే చేసి నిరాశపరిచిన ఈ పంజాబ్ వీరుడు రెండో ఇన్నింగ్స్ లో తన స్థాయికి తగ్గట్టుగా ఆడి సెంచరీతో మెరిశాడు. 171 బంతుల్లో 102 పరుగులు చేసి శ్రేయాస్ గోపాల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. గిల్ ఫామ్ లోకి రావడంతో టీమిండియాకు శుభ సూచికం. 

ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గిల్ ఘోరంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్ ల్లో కేవలం 93 పరుగులు చేశాడు. కనీసం ఒక్క హాఫ్ సెంచరీని చేయలేకపోయాడు. దీంతో గిల్ ఆట తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఫామ్ కోసం దేశవాళీ క్రికెట్ ఆడి తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లలో గిల్ ఒక్కడే రంజీ ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. రోహిత్, జైశ్వాల్, రిషబ్ పంత్ కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ఇదిలా ఉంటే గిల్ అద్భుతమైన సెంచరీ చేసిన పంజాబ్ చిత్తుగా ఓడిపోయింది. 

Also Read : అదృష్టం అంటే ఇదే! గ్రౌండ్ వదిలి వెళ్లిన క్రికెటర్‌ను బ్యాటింగ్‌కు పిలిచిన అంపైర్లు

కర్ణాటకతో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ ఇన్నింగ్స్ 207 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో కర్ణాటక 475 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 420 పరుగుల ఆధిక్యం లభించింది. కర్ణాటక ఇన్నింగ్స్ లో స్మరన్ రవిచంద్రన్ డబుల్ సెంచరీ (202)తో అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో పంజాబ్ 213 పరుగులకే ఆలౌట్ అయింది.