Shubman Gill: స్మిత్, ఫిలిప్స్‌లను వెనక్కి నెట్టి.. ఐసీసీ అవార్డు సొంతం చేసుకున్న గిల్

Shubman Gill: స్మిత్, ఫిలిప్స్‌లను వెనక్కి నెట్టి.. ఐసీసీ అవార్డు సొంతం చేసుకున్న గిల్

టీమిండియా యంగ్ ప్లేయర్ శుభమాన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఫిబ్రవరి నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించడంతో బుధవారం (మార్చి 12) గిల్ను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ బ్యాటర్ ఫిలిప్స్  పోటీ పడగా వీరిద్దరినీ టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ వెనక్కి నెట్టి అవార్డు సింథమ్ చేసుకున్నాడు. 

ఫిబ్రవరి నెలలో గిల్ అత్యద్భుతంగా రాణించాడు.  ఈ నెలలో ఐదు వన్డేలాడిన గిల్ 94.19 స్ట్రైక్ రేట్‌తో 406 పరుగులు చేశాడు. అతని యావరేజ్ 100 కి పైగా ఉండడం విశేషం. ఇంగ్లాండ్ పై భారత్ 3-0 తేడాతో సిరీస్ గెలుచుకోవడంలో గిల్ దే ప్రధాన పాత్ర. ఈ సిరీస్ వరుసగా మూడు వన్డేల్లో 50 కి పైగా స్కోర్లు చేశాడు. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి మ్యాచ్ లో 87 పరుగులు.. రెండో వన్డేలో కటక్‌లో 60 పరుగులు.. చేసిన గిల్ అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్ లో కేవలం 102 బంతుల్లోనే 112 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు. 

ALSO READ | Yuzvendra Chahal: పాంటింగ్ నేను ఓపెనింగ్‌కు రెడీ.. బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో చాహల్ బిజీ

గిల్ ఇదే ఫామ్ ను ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 101 పరుగులు చేసిన ఈ టీమిండియా ఓపెనర్.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 46 పరుగులు చేశాడు. ఓవరాల్ గా ఫిబ్రవరి నెలలో గిల్ ఐదు ఇన్నింగ్స్ ల్లో ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. గిల్‌కు ఇది మూడో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కావడం విశేషం. గతంలో 2023 జనవరి, సెప్టెంబర్‌లలో రెండుసార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు.