
టీమిండియా యువ స్టార్ బ్యాటర్ శుభమాన్ గిల్ ప్రస్తుత క్రికెట్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. గిల్ పై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటింది. అతను చాలామంది సెలెబ్రిటీలతో ప్రేమలో ఉన్నట్టు.. కొందరితో డేటింగ్ చేస్తున్నట్టు గతంలో చాలానే వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిలో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలియదు. గిల్ కూడా ఎప్పుడూ తన రిలేషన్ షిప్ పై నోరు విప్పలేదు. సారా టెండూల్కర్, సారా అలీ ఖాన్,అవనీత్ కౌర్, ప్రజ్ఞ జైశ్వాల్ ఈ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఇటీవలే తన డేటింగ్ రూమర్స్ పై గిల్ క్లారిటీ ఇచ్చాడు.
హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ మాట్లాడుతూ.. తాను మూడు సంవత్సరాలకు పైగా సింగిల్ గానే ఉంటున్నాని స్పష్టం చేసి తనపై వస్తున్న డేటింగ్ ఊహాగానాలన్నింటినీ ఖండించాడు. "నేను మూడు సంవత్సరాలకు పైగా సింగిల్ గానే ఉంటున్నాను. నాపై చాలా ఊహాగానాలు, పుకార్లు వస్తున్నాయి. వేర్వేరు వ్యక్తులతో నన్ను ముడిపెడుతున్నారు. కొన్నిసార్లు, నేను నా జీవితంలో ఎప్పుడూ ఆ వ్యక్తిని చూడలేదు.. అదే విధంగా కలవలేదు. ఇలాంటివి విన్నప్పుడు చాలా నవ్వొస్తుంది. నేను ఫలానా వ్యక్తితో ఉన్నాననే పుకార్లు ఆశ్చరం కలిగిస్తాయి.
"నా క్రికెట్ కెరీర్ పైనే నేను దృష్టి పెట్టానని నాకు తెలుసు. నా జీవితంలో ఎవరికీ స్థానం లేదు. 300 రోజులు మేము ఎక్కడికో ఒకసారి ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఎవరి మీద సమయం వెచ్చించడానికి నా దగ్గర సమయం లేదు". అని గిల్ అన్నాడు. ప్రస్తుతం గిల్ ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్సీ చేస్తున్న శుభమాన్.. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు గుజరాత్ ఆడిన 8 మ్యాచ్ ల్లో 6 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ తమ తదుపరి మ్యాచ్ సోమవారం (ఏప్రిల్ 28) ఆడుతుంది.
Shubman Gill has finally said it about his dating rumours with sara tendulkar. pic.twitter.com/GrThDLxCoR
— mufaddla parody (@mufaddl_parody) April 26, 2025