టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా తొలి టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో యువ క్రికెటర్లు సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఐపీఎల్ లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్లకు ఈ సిరీస్ లో అవకాశం దక్కింది. 5 టీ20 ల సిరీస్ లో భాగంగా శనివారం (జూలై 6) తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ కావడంతో ప్లేయింగ్ 11 లో ఎవరికి చోటు దక్కుతుందో ఆసక్తికరంగా మారింది.
ఓపెనర్లుగా గిల్, అభిషేక్ శర్మ
తొలి టీ20 లో కెప్టెన్ శుభమాన్ గిల్, అభిషేక్ శర్మ టీమిండియా ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. మూడో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఆడతాడు. శుక్రవారం (జూలై 5) ప్రెస్ కాన్ఫరెన్సు లో కెప్టెన్ గిల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నాలుగో స్థానంలో పరాగ్ టీ20 అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడో మ్యాచ్ నుంచి అందుబాటులో ఉండనున్నాడు. ఐదో స్థానంలో ఫినిషర్‌గా రింకూ సింగ్‌కు ప్లేస్ ఖాయం. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్ లలో ఎవరిని తీసుకుంటారో ఆసక్తిగా మారింది.
బౌలింగ్‌లో పేసర్లుగా అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ లకు ఛాన్స్ దక్కొచ్చు. దూబే వచ్చే వరకు ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను కంటిన్యూ చేయనున్నారు. లెగ్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ అన్ని మ్యాచ్‌లు ఆడే చాన్స్ ఉంది.
ఇండియా తుది జట్టు అంచనా:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ / జితేష్ శర్మ, సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.
India captain Shubman Gill has confirmed that he and uncapped Abhishek Sharma will open the innings for the first T20I of the five-match bilateral series against Zimbabwe to be played in Harare. He also added that Ruturaj Gaikwad will bat at No.3 for the Men In Blue.… pic.twitter.com/YC8fCugL1Q
— Dais World ® (@world_dais) July 5, 2024