ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో యువ బ్యాటర్ శుభమాన్ గిల్ సెంచరీతో సత్తా చాటాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో గిల్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఫామ్ లేక తంటాలు పడుతున్న గిల్ మీద తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కీలక దశలో ఈ యువ బ్యాటర్ సెంచరీతో తనని తాను మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం భారత్ 344 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. గిల్ (100) అక్షర్ పటేల్ క్రీజ్ లో ఉన్నారు.
గిల్ కు టెస్టుల్లో ఇది మూడో సెంచరీ. అంతకముందు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మీద సెంచరీ చేశాడు. లంచ్ తర్వాత గిల్, అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ భారీ భాగస్వామ్యాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. లంచ్ కు ముందే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(13) మరోసారి విఫలమవ్వగా.. డబుల్ సెంచరీ హీరో జైస్వాల్(17) పరుగులకే వెనుదిరిగాడు.గిల్- అయ్యర్ జోడిగిల్- అయ్యర్ జోడి 81 పరుగులు జోడించిన తర్వాత ఒక అనవసర షాట్ కు అయ్యర్ తన వికెట్ ను పారేసుకున్నాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన పటిదార్ 9 పరుగులకే ఔటయ్యాడు.
WELCOME BACK, SHUBMAN GILL...!!! ⭐ pic.twitter.com/WaG21uL3G4
— Kohli Sensation (@KohliiSensation) February 4, 2024